పనులు నాణ్యతతో చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ మెట్ల మార్గం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు నూతనంగా చేపడుతున్న షెడ్డు నిర్మాణం పనులను నాణ్యతతో చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ సూచించారు. మంగళవారం పాతగుట్ట ఆలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. షెడ్డు నిర్మాణం పనులతో పాటు దేవస్థానానికి చెందిన చౌల్ట్రీలను పరిశీలించారు. ఈఓ వెంకట్రావ్ మాట్లాడుతూ.. దేవస్థానానికి చెందిన గదుల్లో భక్తుల సౌకర్యం, శానిటేషన్, పరిశుభ్రతపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. దృష్ట్యా బస్‌స్టాండ్ వద్ద ఎంకై ్వరీ కౌంటర్ ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో ఎంకై ్వరీ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. గదుల ఎంకై ్వరీ కౌంటర్‌లో ఫిర్యాదు రిజిస్ట్రార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలన్నారు. పాతగుట్ట ఆలయంలో సైతం వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట షెడ్డు దాత జ్ఞానేశ్వర్, ఆలయాధికారులు ఉన్నారు.


