ఊరు మారలేదు
యాదగిరిగుట్ట రూరల్: మమ్మల్ని గెలిపించండి.. మీ కష్టాలు తీరుస్తాను. అండగా ఉంటాను. సమస్యలు పరిష్కరిస్తామని ఐదేళ్ల క్రితం గ్రామాల్లో పోటీచేసిన నాయకులు చెప్పిన మాటలు ఇవి. ప్రజలు వారికి అధికారం కట్టబెట్టారు. ఐదేళ్లు గడిచిపోయాయి కానీ గ్రామాల్లో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. తిరిగి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. నేతలు మళ్లీ జనం ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. పాలకులు మారుతున్నారు తప్ప.. సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని నాయకులను నిలదీస్తున్నారు.
గ్రామాల్లో ప్రధాన సమస్యలు
● జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. గతంలో ఏర్పాటు చేసిన డ్రెయినేజీలే చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. మురుగు నీరంతా వీధుల వెంట, జనావాసాల మధ్య ప్రవహిస్తోంది. అక్కడక్కడ నూతన డ్రెయినేజీలు నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు..
● పలు గ్రామాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వర్షాలు కురిసన సమయంలో లింక్ రోడ్ల ద్వారా గ్రామాల నుంచి, ఇంకో గ్రామానికి వెళ్లడానికి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటుంది. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ సీసీ రోడ్లు మంజూరైనప్పటికీ, మెజార్టీ గ్రామాల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి.
● చాలా గ్రామాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉండడం, నిర్వహణ లోపంతో చాల చోట్ల వీధులన్నీ అంధకారంలో ఉంటున్నాయి. రాత్రి సమయంలో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది.
● పలు గ్రామాల్లో ప్రజలను పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీధుల్లో కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గత ప్రభుత్వంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గ్రామాల్లో పరిస్థితి యథావిధిగా మారింది.
● చాలా గ్రామాల్లో రోడ్లు పాడై, కంకర తేలి ఉన్నాయి. రాకపోకలు సాగించలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
● పంచాయతీ భవనాలు సరిగా్గా లేక పాలన కష్టమవుతోంది. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన గ్రామాల్లో ఐదేళ్లు గడిచినా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయలేదు. కమ్యూనిటీ హాల్‌లు కూడా లేకపోవడంతో ప్రజలు నాయకులను నిలదీస్తున్నారు.
ఫ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఫ నాటి హామీలను గుర్తుచేస్తున్న ఓటర్లు
ఊరు మారలేదు


