ఎన్‌హెచ్‌వీఆర్‌లో రాష్ట్రస్థాయికి 8 పాఠశాలలు
ఫ విజయ్ దివస్
రామన్నపేట ఆర్‌ఐ సస్పెన్షన్
రామన్నపేట: రామన్నపేట ఆర్‌ఐ రాజేశ్వర్ సస్పెండ్ అయ్యారు. ఈమేరకు కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కక్కిరేణి గ్రామంలో 98, 106, 107, 109, 110 సర్వే నంబర్లలోని 4.03 ఎకరాల భూమి 1964 నుంచి శ్రీ భక్తమార్కేండేయ దేవస్థానం ఆధీనంలో ఉందని 2024లో ఉన్నతాధికారులకు ఆర్‌ఐ రాజేశ్వర్ నివేదిక సమర్పించారు. ఈఏడాది ఫిబ్రవరిలో అవే సర్వే నంబర్లలోని రెండు ఎకరాలు ఓ వ్యక్తి ఆధీనంలో ఉందని మరో నివేదికను ఇచ్చారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి ఇటీవల విచారణ నిర్వహించారు. నివేదిక ఆధారంగా కలెక్టర్ హనుమంతరావు ఆర్‌ఐను సస్పెండ్ చేశారు.
భువనగిరి: స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ (ఎన్‌హెచ్‌వీఆర్)లో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే పాఠశాలలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛతలో ఆరు అంశాలకు సంబంధించి గత అక్టోబర్‌లో ప్రధానోపాధ్యాయులు జిల్లాలోని 819 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగా రేటింగ్ ప్రకటించారు. ఇందులో జిల్లాలో 28పాఠశాలలు 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. సీనియర్ ప్రధానోపాధ్యాయులు, జీహెచ్‌ఎంసీలు ఆయా పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటిలో 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో ఎంపికై తే పాఠశాలలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ తెలిపారు.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
రూరల్– 1 కేటగిరీ : మక్తాఅనంతారం ప్రాథమికోన్నత పాఠశాల (బీబీనగర్ మండలం), నందనం ప్రాథమికోన్నత పాఠశాల (భువనగిరి మండలం), వాయిలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల (నారాయణపురం మండలం).
రూరల్– 2కేటగిరి : జనగామ జెడ్పీ ఉన్నత పాఠశాల (నారాయణపురం మండలం), వీరారెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల (తుర్కపల్లి మండలం), చీకటిమామిడి జెడ్పీ ఉన్నత పాఠశాల (బొమ్మలరామారం మండలం).
అర్బన్– 1కేటగిరీ : బంగారిగడ్డ ప్రాథమికోన్నత పాఠశాల (చౌటుప్పల్ మండలం)
అర్బన్– 2 కేటగిరీ: ఆలేరులోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఎంపికై ంది.


