డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దు
వలిగొండ : పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకులోనై ఓట్లు అమ్ముకోవద్దని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న వలిగొండలో మంగళవారం ఓటుహక్కుపై స్వయం సహాయ సంఘాల మహిళలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ, ఎంఈఓ భాస్కర్, ఎస్సై యుగంధర్, ఎంపీఓ అర్జుమన్ భాను, ఏపీఎం అంజయ్య, ఏపీఓ పరుశురాం పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు చేయాలి
ఆత్మకూరు(ఎం): మండలంలోని సర్వేపల్లిలో ఏర్పాటు చేస్తున్న మోడల్ పోలింగ్ కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని సర్వేపల్లిలో ఏర్పాటు చేస్తున్న మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పోలింగ్ బూత్‌గా ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ సౌకర్యం కల్పించాలని, పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, టెంట్ సదుపాయం కల్పించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రాములు నాయక్, తహసీల్దార్ లావణ్య తదితరులున్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


