రీజినల్‌ రింగ్‌ రైల్వేలైన్‌ పనులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రీజినల్‌ రింగ్‌ రైల్వేలైన్‌ పనులు చేపట్టాలి

Dec 10 2025 9:18 AM | Updated on Dec 10 2025 9:18 AM

రీజినల్‌ రింగ్‌ రైల్వేలైన్‌ పనులు చేపట్టాలి

రీజినల్‌ రింగ్‌ రైల్వేలైన్‌ పనులు చేపట్టాలి

సాక్షి,యాదాద్రి : ఔటర్‌ రీజినల్‌ రింగ్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిలో లోక్‌సభలో ప్రస్తవించారు. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 400 కిలోమీటర్లు విస్తరించి, సుమారు 8 జిల్లాలను కవర్‌ చేస్తుందని తెలిపారు. 14 మండలాల్లో కనెక్టివిటీ ఉంటుందన్నారు. దాదాపు 5 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, రైల్వే ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.12,000 కోట్లు ఉంటుందన్నారు. ఇది రాబోయే ఔటర్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా హైదరాబాద్‌ నగరాన్ని విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం సర్వే పూర్తయినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ఈ రింగ్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలు, ఐటీ హబ్‌లు, ఫార్మాస్యూటికల్‌ క్లస్టర్లు, లాజిస్టిక్‌ పార్కులను సృష్టిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఫ లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement