జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక
సూర్యాపేటటౌన్, కోదాడ : తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్(అండర్–14) పోటీల్లో సూర్యాపేట పట్టణంలోని రాడికల్ చెస్ అకాడమీకి చెందిన అఖిలేష్ పాల్గొని జాతీయస్థాయికి ఎంపికై నట్లు కోచ్ ఎడవెల్లి అనిల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా కోదాడ పట్టణ పరిధిలోని తేజ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న భుక్యా యోగిత కూడా బాలికల విభాగంలో విజేతగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. 2026 జనవరి 13 నుంచి 17 వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరగనున్న జాతీయస్థాయి చెస్ పోటీల్లో(అండర్–14) వారు పాల్గొననున్నారు. యోగిత జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డైరెక్టర్ సోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
బొమ్మలరామారం : మర్యాల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని డి. నిహారిక అండర్–17 జాతీయ స్థాయి బాలికల అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మలజ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో గత నెల నిర్వహించిన అండర్–17 రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నిహారిక పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. నిహారికను డీఈఓ సత్యనారయణ, ఎంఈఓ రోజారాణి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కందాడి దశరధ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక


