సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీలో పేలుడు
సూర్యాపేట, చివ్వెంల : చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులోని బాలాజీ లైట్‌వెయిట్ సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఫ్యాక్టరీ సమీపంలోని మున్యానాయక్ తండా, కొండల్‌రాయునిగూడెం, బీబీగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనని భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ట్యాంక్ శకలాలు సుమారు కిలోమీటరు మేర ఎరిగిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ పి. చంద్రశేఖర్, ఎస్‌ఐ మహేశ్వర్ పరిశీలించారు. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని ఫ్యాక్టరీ యాజమానిని ఆదేశించారు.
ఫ ప్రమాద సమయంలో ఎవరూ
లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం
ఫ భయాందోళనకు గురైన
సమీప ప్రాంత ప్రజలు


