సేవకులకే మా ఓట్లు
నార్కట్‌పల్లి : ‘మా ఓటు డబ్బలు ఇచ్చే వారికి కాదు.. గ్రామం కోసం పని చేసే సేవకులకు మాత్రమే’ అంటూ నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన మాజీ వార్డు సభ్యురాలు దేవరశెట్టి రుక్మిణి తన ఇంటిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఓటు ఎంతో విలువైందని, అభివృద్ధి చేసేవారికి ఓటు వేసి ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చే నాయకులు, స్థానికులకు అవగాహన కల్పించేందుకే తాము బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఓటును అమ్ముకోకుండా ఉంటే సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీసే అధికారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.


