అన్నదమ్ముల సవాల్..
నకిరేకల్ : నకిరేకల్ మండలం మండలాపురం గ్రామంలో సొంత అన్నదమ్ములు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఈ గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా.. తీగల జానయ్య కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్నాడు. జానయ్య అన్న తీగల వెంకటయ్య కూడా కొంతకాలంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తమ్ముడితో పోటీ పడుతున్నాడు. వీరితో పాటు బీఆర్‌ఎస్ నుంచి బలపర్చిన అభ్యర్థిగా జంగయ్య, మరో స్వతంత్ర అభ్యర్థి నర్సింహ కూడా బరిలో ఉన్నారు. అయితే అన్నదమ్ముల మధ్య పోటీతో పోరు రసవత్తరంగా మారింది.
అన్నదమ్ముల సవాల్..


