ఇటలీ దంపతులకు చిన్నారి దత్తత | - | Sakshi
Sakshi News home page

ఇటలీ దంపతులకు చిన్నారి దత్తత

Dec 9 2025 10:49 AM | Updated on Dec 9 2025 10:49 AM

ఇటలీ దంపతులకు చిన్నారి దత్తత

ఇటలీ దంపతులకు చిన్నారి దత్తత

భువనగిరిటౌన్‌ : భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలిక రేణుకను ఇటలీకి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. బాలిక వివరాలను కేంద్ర దత్తత వనరుల విభాగంలో ఆన్‌లైన్‌ చేయగా.. ఇటలీ దంపతులు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం.. సీనియార్టీ ప్రకారం ఇంటర్‌ కంట్రీ అడాప్షన్‌కు అంగీకరించింది. దీంతో సోమవారం అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో బాలికను ఇటలీ దంపతులకు అప్పగించారు. బాలిక సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, బీఆర్‌బీ కో–ఆర్డినేటర్‌, అనంతలక్ష్మి, డీసీపీయూ యూనిట్‌ సిబ్బంది, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement