
ఆలయం, భక్తుల భద్రతపై నిత్య పర్యవేక్షణ
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేతంతో పాటు భక్తుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు. ఆదివారం ఆయన దేవస్థానం పోలీస్ కంట్రోల్ రూంను సందర్శించి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఎస్‌పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులకు భద్రతపై సూచనలు ఇచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రత కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఆలయ విభాగాల్లో పారదర్శకత,
నిర్వహణ లోపాల నివారణకు కమిటీ
ఆలయంలోని వివిధ విభాగాల్లో పారదర్శకత, నిర్వహణ లోపాలు నివారించడం, అంతర్గత అడిట్, భక్తులు, స్థానికుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడటం తదితర వాటికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఈఓ వెల్లడించారు. కమిటీ చైర్మన్‌గా తాను ఉంటానని పేర్కొన్నారు. టెంపుల్, ప్రసాదం, అన్నదానం మానిటరింగ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ, సెక్యూరిటీ, శానిటేషన్, క్లీనింగ్, విద్యుత్, సీసీ కెమెరాలు, వైర్‌లెస్ సిస్టం, బ్యాటరీ వాహనాలు, ఏసీలు, లిఫ్టు, అకామిడేషన్, ఎడ్యుకేషనల్ ఇనిస్టిస్ట్యూట్, రెవెన్యూ, లీజు, అద్దెలు, అకౌంట్స్ విభాగాలకు మేనేజ్‌మెంట్ కమిటీలను నియమించినట్లు వెల్లడించారు.
ఫ గుట్ట దేవస్థానం ఈఓ వెంకట్రావ్