
ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం
గరిడేపల్లి: ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీని పోలీసులు తెలుసుకుని ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గరిడేపల్లి మండలంలోని కుత్భుషాపురం గ్రామానికి చెందిన షేక్ జాన్‌సైదులు కోదాడలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం భార్యతో విభేదాలు రావడంతో కుత్భుషాపురం గ్రామంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మరోసారి భార్య, అత్తమామలతో గొడవ పడ్డాడు. వారికి చెప్పకుండా లారీలో లోడ్ దించేందుకు భూటాన్ దేశానికి వెళ్లాడు. లారీని మరో డ్రైవర్‌తో ఇండియాకు పంపించాడు. అతను అక్కడే మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జాన్‌సైదులు కనిపించకపోవడంతో అతడి భార్య ఆస్మా ఫిబ్రవరిలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఎస్‌ఐ చలికంటి నరేష్ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. సదరు జాన్‌సైదులు నెలకు ఒక సిమ్ మారుస్తుండటం, భూటాన్ దేశంలో సెల్ పనిచేయకపోవడంతో ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎస్‌ఐ చాకచక్యంగా జాన్‌సైదులును ఇండియాకు రప్పించారు. 20 రోజుల క్రితం జాన్‌సైదులు హైదరాబాద్‌కు చేరిన విషయం గుర్తించిన ఎస్‌ఐ అతని కదలికపై ప్రత్యేక నిఘా పెట్టారు. తమ సిబ్బందితో గాలించి ఎట్టకేలకు అతడిని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వైభవంగా హరిహర పంచాలు
భువనగిరి: స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా హరిహర పంచాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు హృషికేష్, శివేష్‌లు తన జీవితంలో కొత్త దశను ప్రారంభించడాన్ని పురస్కరించుకుని ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రాజేశంగౌడ్, మాజీ న్యాయమూర్తి బలరాం హాజరయ్యారు. అంతకు ముందు వారుఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫ భార్యతో విభేదాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త
ఫ భూటాన్‌లో ఉన్నట్లు గుర్తించి ఇండియాకు రప్పించిన పోలీసులు