
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్యకల్యాణం కనుల పండువగతా నిర్వహించారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామర్చన తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
స్వర్ణగిరి క్షేత్రంలో స్వామివారికి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు