
ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం
శాలిగౌరారం: ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం శాలిగౌరారం మండలకేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన గండికోట శ్రీనివాస్(38) తన తల్లి, చెల్లెలుతో కలిసి ద్విచక్ర వాహనంపై శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో మృతిచెందిన తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఈ ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై మండల కేంద్రం మీదుగా శాలిగౌరారం–భైరవునిబండ ప్రధాన రోడ్డుపై కురుమర్తికి వస్తున్నారు. ఈక్రమంలో మండల కేంద్రంలో ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్న ఆకారం గ్రామానికి చెందిన గోదాసు భద్రయ్య ట్రాక్టర్ ఎరువుల లోడుతో ఆకారం వెళ్తుండగా దానిని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వీరి బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న శ్రీనివాస్ ట్రాక్టర్ ట్రాలీ చక్రం కింద పడగా.. బైక్ వెనుక కూర్చున్న అతని తల్లి, చెల్లెలు రోడ్డుపక్కకు పడ్డారు. ట్రాక్టర్ ట్రాలీ చక్రం శ్రీనివాస్ తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జయింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.
కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన
శ్రీనివాస్ మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న అతడి బంధువులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
ఫ బంధువు అంత్యక్రియలకు
వెళ్లివస్తుండగా ఘటన