ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

Jul 18 2025 5:04 AM | Updated on Jul 18 2025 5:04 AM

ఎంజీయ

ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

నల్లగొండ టూటౌన్‌: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణను యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ పరిశీలించి మాట్లాడారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, కాపీయింగ్‌ పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వీసీ వెంట రిజిస్ట్రార్‌ అల్వాల రవి, చీఫ్‌ ఎగ్జామినేషన్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌రెడ్డి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అరుణప్రియ ఉన్నారు.

టైరు పేలి లారీ దగ్ధం

వలిగొండ: టైరు పేలి నిప్పు రవ్వలు ఎగిరిపడి లారీ దగ్ధమైంది. ఈ ఘటన వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నుంచి తవుడు లోడుతో తమిళనాడుకు వెళ్తున్న లారీ మార్గమధ్యలో వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలోకి రాగానే టైరు పేలింది. దీంతో నిప్పు రవ్వలు ఎగిరిపడి మంటలంటుకొని లారీకి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో భువనగిరి, రామన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. లారీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు.

రైల్వే స్టాఫ్‌తో వెళ్తున్న రైలు కోచ్‌లో పొగలు

బీబీనగర్‌: వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు గురువారం రైల్వే స్టాఫ్‌తో వెళ్తున్న రైలు కోచ్‌లో పొగలు వ్యాపించాయి. రైల్వే ట్రాక్‌ పరిశీలనలో భాగంగా బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ మార్గంలో రైల్వే స్టాఫ్‌తో వెళ్తున్న రైలు కోచ్‌ బ్రేక్‌ ప్యాడ్స్‌ పట్టివేయడంతో స్పార్క్‌ రావడంతో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది బీబీనగర్‌ స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపివేసి పొగలను అదుపులోకి తెచ్చి బ్రేక్‌ ప్యాడ్‌లను సరిచేశారు. అనంతరం ట్రైన్‌ స్టేషన్‌ను నుంచి వెళ్లిపోయింది.

యువకుడి మృతిపై

కేసు నమోదు

మర్రిగూడ: మర్రిగూడ మండలం మేటిచందాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందూర్తి గ్రామంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందగా.. గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన బత్తుల సైదులు(25) ఇందూర్తి గ్రామంలో సరిత అనే మహిళ ఇంటి ముందు పురుగుల మందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి తండ్రి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అంతకుముందు మృతదేహాన్ని తమకు చూపించాలని మృతుడి బంధువులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించగా.. ఎస్‌ఐ వారికి సర్ధిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం
1
1/2

ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం
2
2/2

ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement