
నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం
● మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే
బండి పుల్లయ్యకు తీవ్రగాయాలు
నకిరేకల్: నకిరేకల్ మండలం చందంపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు తన కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో నకిరేకల్ మండలం చందంపల్లి శివారులోని 365వ నంబర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఎదురుగా రాంగ్ రూట్‌లో వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. వర్షం కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్యను మెరుగైన చికిత్స నిమిత్తం హైదారబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు.