
బుద్ధవనాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి
నాగార్జునసాగర్: సాగర్‌లోని బుద్ధవనాన్ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం సందర్శించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్ధవనం విశేషాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని మహాస్థూపం ధ్యానమందిరంలో ఆయన బుద్ధ జ్యోతిని వెలిగించి కాసేపు ధ్యానం చేశారు. బుద్ధవనం ప్రాజెక్టు విశేషాలతో కూడిన వీడియో చిత్రాన్ని ఉపముఖ్యమంత్రి తిలకించారు. ఆయన వెంట రాష్ట్ర జెన్‌కో సీఎండీ హరీష్, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు ఉన్నారు.

బుద్ధవనాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి