
ఫైర్ సిబ్బంది సేవలు అభినందనీయం
యాదగిరిగుట్ట: విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చూపే తెగువ అభినందనీయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెస్కూ చేయడం గొప్ప విషయమన్నారు. డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బందిని పెంచామని వెల్ల డించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తక్షణమే 101కి సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు అగ్నిమాపక పరికరాలు, ఫైరింజన్లను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి మధసూదన్‌రావు, ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, పట్టణ సీఐ భాస్కర్, వివిధ జిల్లాల అగ్నిమాపక అధికారులు అశోక్, ఆవుల వెంకన్న, ధనుంజయరెడ్డి, రెహమాన్‌బాబు, యాదగిరిగుట్ట ఫైర్‌స్టేషన్ ఆఫీసర్లు అబ్దుల్ అమీద్, మధుసూదన్‌రెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చైతన్యరెడ్డి, సెఖ్మెట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (దాత) ఉమా గండూరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య,
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ఫైర్ సిబ్బంది సేవలు అభినందనీయం