
561 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం నీటి మట్టం గురువారం సాయంత్రానికి 561 అడుగులకు (235 టీఎంసీలు) చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 67896 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదలవుతోంది. గడిచిన 24 గంటల్లో శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 57,103 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సాగర్ నుంచి విద్యుదుత్పాదన ద్వారా 4419 క్యూసెక్కుల నీటిని దిగువన టెయిల్‌పాండ్‌లోకి విడుదల చేశారు. తిరిగి 4,630 క్యూసెక్కులను రివర్స్ పంపుల ద్వారా సాగర్ జలాశయంలోకి ఎత్తి పోశారు.