
దరఖాస్తుల ఆహ్వానం
రామన్నపేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్‌ఖానం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్, డైరీ సైన్స్, ఇంగ్లిష్, తెలుగు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్ సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుందన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో జనరల్ బీసీ అభ్యర్థులు 55శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి గలవారు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బాలికల హాస్టల్ తనిఖీ
భూదాన్‌పోచంపల్లి : విద్యార్థులు ప్రాథమిక దశనుంచే లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి జినుకల శ్యామ్‌సుందర్ సూచించారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తమకు బంకర్‌బెడ్స్ కావాలని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరి శీలించారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. చదువు ద్వారానే గుర్తింపు వ స్తుందని విద్య ప్రాముఖ్యత, ప్రభుత్వం వి ద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు.
‘నేతన్న భరోసా’కు
దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరి: నేతన్న భరోసా పథకానికి చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగిన ప్రతి కార్మికుడు పథకానికి అర్హులన్నారు. పథకంలో నమోదు కావడానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడి పూర్తి వివరాలను పొందుపరిచిన ఫారం–ఎ, తెలంగాణ చేనేత లేబుల్ కోసం ఫారం–బిని అందజేయాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించే క్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. ఈ నెల 22నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
బ్రహ్మకుమారీస్
కృషి ప్రశంసనీయం
బీబీనగర్ : శాంతి స్థాపనలో బ్రహ్మకుమారీస్ కృషి ప్రశంసనీయమని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు అజిత్‌పాఠక్ అన్నారు. బీబీనగర్ మండలం మహాదేవ్‌పురంలోని బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పబ్లిక్ రిలేషన్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల మధ్య, సమాజంలోని వర్గాల మధ్య, కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వసనీయత లోపించినప్పుడు అశాంతి ఏర్పడుతుందన్నారు. అలాంటి తరుణంలో ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనశాంతి పొందితే ఉపశమనం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ మీడియా వింగ్ వైస్ చైర్‌పర్సన్ సరళ, వాయిస్ సంపాదకుడు బాబ్జీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మణ్, బ్రహ్మకుమారీస్ డైరెక్టర్లు రాజకుమారి, సునీత పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం