ఆస్తుల లెక్క.. ఇక పక్కా | - | Sakshi
Sakshi News home page

ఆస్తుల లెక్క.. ఇక పక్కా

Jul 21 2025 8:01 AM | Updated on Jul 21 2025 8:01 AM

ఆస్తుల లెక్క.. ఇక పక్కా

ఆస్తుల లెక్క.. ఇక పక్కా

ఆగుతూ.. సాగుతూ..

2020లో ప్రారంభించిన భువన్‌ సర్వే కొన్ని నెలల పాటు కొనసాగింది. ఆ తరువాత కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిచిపోయింది. సర్వే ప్రారంభించిన కొత్తలో భువనగిరి మున్సిపాలిటీలో 13,025 అసెస్‌మెంట్‌లను సర్వే చేసి వివరాలను భువన్‌ యాప్‌లో నమోదు చేశారు. మిగతావి పెండింగ్‌లో పడ్డాయి. 2023లో సర్వేను తిరిగి ప్రారంభించినప్పటికీ సాంకేతిక కారణాలతో మళ్లీ నిలిచిపోయింది. భువన్‌ యాప్‌ సర్వేను కొనసాగించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన పునఃప్రారంభించారు. గతంలో 1,951 అసెస్‌మెంట్స్‌ సర్వే చేయకుండా మిగిలిపోగా.. కొత్తగా మరో 2,073 నిర్మాణాలు వెలిశాయి. పాతవి, కొత్తవి కలిపి 4,024 భవనాలను సర్వే చేయాల్సి ఉంది. కాగా ఆరు రోజులుగా కొనసాగుతున్న సర్వే ద్వారా 425 అసెస్‌మెంట్‌ల సర్వే పూర్తయ్యింది.

భువనగిరి టౌన్‌ : అనుమతి ఒక ఫ్లోర్‌కు.. నిర్మించేది రెండు ఫ్లోర్లు.. ఇళ్ల కోసం పర్మిషన్‌ వాణిజ్య భవనాల నిర్మాణం.. ఇలా పలు విధాలుగా నిబంధనల ఉల్లంఘనతో మున్సిపాలిటీల ఆదాయానికి గండి పడుతోంది. ఉల్లంఘనలకు చెక్‌ పెట్టడానికి, ఆస్తుల వివరాలను పక్కాగా నమోదు చేయడానికి మున్సిపల్‌శాఖ భువన్‌ సర్వేను పునఃప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను భువన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతీ నివాసం, భవనం, స్థలం కొలతలు తీసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న పర్మిసన్‌, వాస్తవ నిర్మాణానికి తేడా ఉంటే వెంటనే సరిచేసి ఆన్‌లైన్‌లో కచ్చితమైన, వాస్తవ వివరాలను నమోదు చేస్తున్నారు.

ఆస్తిపన్ను మదింపులో పారదర్శకత

ఆస్తిపన్ను మదింపులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాణిజ్య భవనాలను నివాస గృహాలుగా చూపి పన్ను తగ్గించుకుంటున్నారు. మరోవైపు ఆస్తి విలువకు అదనంగా పన్ను విధిస్తున్నారన్న పెద్ద ఎత్తున విమర్శలున్నా యి. భువన్‌ యాప్‌ ద్వారా ఇలాంటి అవకతవకలకు చెక్‌పడనుంది.

మున్సిపాలిటీల్లో భువన్‌ సర్వే పునఃప్రారంభం

ఫ క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ విస్తీర్ణం యాప్‌లో నమోదు

ఫ దీని ఆధారంగానే పన్ను మదింపు

ఫ సగానికి పైగా నిర్మాణాల సర్వే పూర్తి

మున్సిపాలిటీ నిర్మాణాలు

భువనగిరి 15,100

పోచంపల్లి 5,108

ఆలేరు 5,346

యాదగిరిగుట్ట 5,159

మోత్కూరు 5,027

చౌటుప్పల్‌ 8,647

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement