
వైజాగ్ కాలనీలో కార్డన్ సెర్చ్
చందంపేట: దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీలో శనివారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వైజాక్ కాలనీకి చెందిన పలువురు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన అమాయక కూలీలను పని కల్పిస్తాం అని ఇక్కడకు తీసుకొచ్చి వారికి వేతనం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని, సొంత ప్రాంతానికి వెళ్లకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించి పలువురికి విముక్తి కల్పించినట్లు ఏఎస్పీ తెలిపారు. అదేవిధంగా సరైన పత్రాలు లేని 22 బైక్‌లు, 4 ఆటోలు సీజ్ చేసి, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను స్థానికులు నిర్బంధించినట్లు
గుర్తించిన పోలీసులు
పలువురికి విముక్తి