
కాలనీల్లో తిరిగి.. కష్టాలు తెలుసుకుని
ఆత్మకూరు(ఎం): మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో పర్యటించారు. ఇందిరానగర్, రాంనగర్, పాత ఆత్మకూరు(ఎం) తదితర ప్రాంతాల్లో కాలినడకన తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిసి ఇంటి నిర్మాణంలో ఎదరవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ఒక మహిళ సమాధానం చెబుతూ.. ఇల్లు నిర్మించుకోవాలని పదేళ్లనుంచి అనుకుంటున్న, దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.. ఇన్నేళ్ల తరువాత సొంతింటి కల నెరవేరిందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. నీకు సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు మంజూరు చేశారని చెప్పారు. మరికొందరు లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే గృహప్రవేశానికి నూతన వస్త్రాలు తీసుకుని వస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు .. గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు రాలేదని, ప్రజాప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, ఇతర సామగ్రి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పాశం పావని, పీఏసీఎస్ డైరెక్టర్ నోముల వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా, మాజీ సర్పంచ్ జన్నాయకోడె నగేష్, పట్టణ అధ్యక్షుడు పోతగాని మల్లేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ దిగోజు నర్సింహచారి, తొర్ర విష్ణు, నాగం లక్ష్మారెడ్డి, పైళ్ళ దామోదర్‌రెడ్డి, తండ శ్రీశైలం, దొంతరబోయిన నవ్య పాల్గొన్నారు.
ఫ ఆత్మకూర్(ఎం)లో ప్రభుత్వ విప్
బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్
ఫ ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా

కాలనీల్లో తిరిగి.. కష్టాలు తెలుసుకుని