
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ కాలనీలో గురువారం ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన కందుకూరి మురళి స్థానిక సాయినగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మురళి కుమారుడు మున్నా(24) గతంలో ఓ బాలికతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది. ఆ బాలిక అనుకోని పరిస్థితుల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మున్నాపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతడు జైలు జీవితం గడిపి కొద్దిరోజుల క్రితం బయటకు వచ్చాడు. మనస్తాపానికి గురై మున్నా గురువారం సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సి. వెంకటేశ్వర్లు తెలిపారు.