
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్‌ముఖిలో గల విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతూ మూడు నెలల క్రితం క్యారీలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన బీటెక్ విద్యార్థి బొడ్డు శ్యామ్‌చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు యూనివర్సిటీ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో న్యా యం చేస్తామని కళాశాల సీఈఓ హామీ ఇచ్చి ఇప్పుడు తప్పుడు కేసులు నమోదు చేయించడం తగదన్నారు. దీక్షలో మృతుడి తండ్రి భానుప్రతాప్, చిప్పల నర్సింగ్‌రావు, బొల్లం రామ్‌కుమార్, భరత్, లోకదాస్, శివ, అజయ్, యేబురాజు, దేవదాసు, డేవిడ్‌రాజ్, రాజు, పద్మజ పాల్గొన్నారు.