
భువనగిరిలోని గాయత్రి హాస్పిట్‌లో లింగ నిర్ధ్ధారణ పరీక్
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసిన ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో వెలుగుచూసింది. పోలీసులు, వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి భువనగిరిలోని గాయత్రి ఆస్పత్రిలో అబార్షన్ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎస్‌ఓటీ పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు గుర్తించారు. ఆస్పత్రి వైద్యుడు హీరేకార్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, గైనాలజిస్ట్ మాలతి, డెమో అంజయ్య పోలీసుల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి వైద్యులు, సిబ్బంది, బాధిత మహిళలను విచారణ చేశారు. పట్టణంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి డయాగ్నోస్టిక్ సెంటర్‌లో లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారని తేలడంతో అక్కడా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు దంతూరి పాండును విచారించారు. జూన్ 30న ఒకరు, ఈనెల 3వ తేదీన మరోకరు స్కానింగ్ కోసం వచ్చినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు గాయత్రి ఆస్పత్రి వైద్యులను చికిత్స కోసం వేర్వేరుగా సంప్రదించారు. వారికి చెప్పిన ప్రకారం ఇద్దరు మహిళలకు ఆదివారం అర్ధరాత్రి చికిత్స చేశారు. ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్‌లో రికార్డులు, కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్కానింగ్ మిషన్ ల్యాబ్‌ను సీజ్ చేశారు. గాయత్రి ఆస్పత్రి వైద్యుడు శివకుమార్, డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు దంతూరి పాండుపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భువనగిరి పట్టణ సీఐ రమేష్ తెలిపారు. అలాగే డాక్టర్ గాయత్రితో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పిండాలు
అబార్షన్ చేయించుకున్న మహిళ పిండాలను డీఎన్‌ఏ పరీక్షల నిమితం ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద తెలిపారు. డాక్టర్ శివకుమార్ చికిత్స చేయడానికి అర్హత లేదని, సర్టిఫికెట్ ప్రకారం ఆస్పత్రిలో వైద్యులు లేరని వెల్ల డించారు. అబార్షన్ చేయించుకున్న ఇద్దరు మహిళల్లో ఒకరికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మరొకరికి ఇక ఆడ పిల్ల ఉన్నారని పేర్కొన్నారు.