
పర్యావరణాన్ని కాపాడుదాం
భూదాన్‌పోచంపల్లి: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి రాంనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎఫ్‌ఓ పద్మజారాణి, పబ్లిక్‌హెల్త్ డీఈ మనోహర, ఎంపీడీఓ భాస్కర్, ఎంఈఓ ప్రభాకర్, రాజారెడ్డి, మేనేజర్ నిర్మల, రాజేశ్, నాయకులు తడక వెంకటేశం, పాక మల్లేశ్, భారత లవకుమార్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రమేశ్, సందీప్, వెంకటేశ్, వాసుదేవ్, బాలకృష్ణ, అనిల్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక వాడలో వన మహోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండకు దిగువన ఉన్న ఆధ్యాత్మిక వాడలో బుధవారం ఆలయ ఉద్యోగులు, మినిస్ట్రీరియల్, మతపర, నాలుగోవ తరగతి సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, పరిసరాలు, సంస్కృత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ, ఆలయ ఉద్యోగులు గజివెల్లి రమేష్‌బాబు, నవీన్‌కుమార్, రఘు, శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుదాం