
కదంతొక్కిన కార్మికలోకం
సాక్షి, నెట్‌వర్క్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రమైన భువనగిరితోపాటు ఆలేరు, యాదగిరిగుట్ట, రామన్నపేట, పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, మోత్కూరు ప్రధాన సెంటర్లతోపాటు మిగతా అన్ని మండల కేంద్రాల్లో కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టాయి. చౌటుప్పల్‌లో ఆర్డీఓ, ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాల ఎదుట ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాడ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.