
నేడు బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవం
నాగార్జునసాగర్: సిద్దార్డుడికి జ్ఞానోదయం అయ్యి గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత మొదటి బోధన చేసిన రోజును స్మరించుకుంటూ గురువారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గౌతమి బుద్ధుని జీవితంలో ముఖ్యమైన ఐదు ఘట్టాలలో ఒకటి మొదటి ఉపన్యాసం. దీనిని ధర్మచక్ర పరివర్తన అనిపిలుస్తారు. బౌద్ధులు, బౌద్ధ అభిమానులు ఈ రోజును ప్రత్యేక దినంగా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఎస్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 11గంటలకు కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమానికి బౌద్ధ సంఘం ప్రతినిధులు, ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు తరలిరానున్నారు.