
పెండింగ్ కేసులకు పరిష్కారం చూపండి
భువనగిరిటౌన్ : రాజీ పడదగిన కేసులతో పాటు ఇతర కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారంట్లు తదితర అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. చిన్నచిన్న కేసులను త్వరగా పరిష్కరించడం వల్ల రాజీకి ఆమోదయోగ్యంకాని కేసులపై దృష్టి సారించవచ్చన్నారు. అనంతరం భువనగిరిలోని సబ్ జైల్‌ను ఆయన సందర్శించి ఖైదీలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. న్యాయ సహకారం అవసరమైన ఖైదీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు