
జనగణనకు సనా్నహాలు
సిబ్బంది జాబితా, గ్రామాల వారీగా మ్యాప్‌లు రెడీ
సాక్షి, యాదాద్రి: 16వ జనాభా లెక్కల సర్వేకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జనగణనకు సంబంధించి ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకం, సమకూర్చుకోవాల్సిన సామగ్రి తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇప్పటికే సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్‌లు కొలిక్కి వచ్చాయి.
చివరి సారిగా 2011లో జనాభా లెక్కింపు
సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు వెల్లడిస్తారు. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. నాటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఉన్నారు. ఆ తరువాత 2021లో లెక్కించాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేంద్రం జనగణన గెజిట్ విడుదల చేయడంలో జిల్లాలోనూ జనాభాను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పేపర్ ద్వారా జనగణన చేపట్టగా.. ఈసారి జిటల్ మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు.
జిల్లా, మండల స్థాయిలో కమిటీలు
జనాభా లెక్కల సేకరణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్‌ఓ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మరికొందరు అధికారులతో జిల్లా కమిటీ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, ఏఎస్‌ఓ(అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి)తో కమిటీ ఉంటుంది. తహసీల్దార్ జనాభా లెక్కల సేకరణ అధికారిగా, ఏఎస్‌ఓ సహాయ అధికారిగా వ్యవహరిస్తారు.
డిజిటల్ మొబైల్ యాప్‌తో సర్వే
ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించనున్నారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటాడు. వీరికి జిల్లా పరిధిలోనే వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నతస్థాయి కమిటీలకు హైదరాబాద్‌లో శిక్షణ ఉంటుంది.ఈసారి డిజిటల్ మొబైల్ యాప్‌ను జనాభా లెక్కల సేకరణకు వినియోగించనున్నారు.
పట్టణ జనాభాపై దృష్టి
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీల శివారు ప్రాంతాలను గుర్తించి వాటిని విస్తరించేందుకు అనువైన పరిస్థితులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటి అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదపడనున్నాయి.
రెండు విడతల్లో లెక్కింపు
రెండు విడతల్లో జనాభా లెక్కించనున్నారు. మొదటి విడత 2025 అక్టోబర్ 1, రెండో దశ 2027 మార్చి1 నాటికి జనాభా లెక్కలు సేకరించనున్నారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి రెండుదఫాలు వెళ్తారు. మొదటి సారి ఇళ్లను లెక్కించడంతో పాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటి అంశాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికి వెళ్తారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు. ముఖ్య ప్రణాళిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు, ఎన్యూమరేటర్లు సేకరించి రూపొందించిన జాబితాల ఆధారంగా ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయికి వెళ్లి నిర్ధారిస్తాయి.
ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులు
పర్యవేక్షణకు జిల్లా, మండల
స్థాయిలో కమిటీలు
త్వరలో హైదరాబాద్‌లో,
జిల్లా పరిధిలోనూ శిక్షణ
బ్లాక్‌లుగా ఇళ్ల విభజన
2027 మార్చి 1వ తేదీ నాటికి
జనాభా లెక్కల సేకరణ
జిల్లా స్వరూపం
భౌగోళిక విస్తీర్ణం 3,795 కి.మీ
రెవెన్యూ గ్రామాలు 321
మండలాలు 17
మున్సిపాలిటీలు 06
పంచాయతీలు 428
మొత్తం జనాభా (2011
లెక్కల ప్రకారం) 7,70,833
పురుషులు 3,90,492
మహిళలు 3,80,341
గ్రామీణ జనాభా 6,47,668
పట్టణ జనాభా 1,23,165
నివాస గృహాలు 1,88,520