
ప్రతిరోజూ చెత్త సేకరించట్లే..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీలో 40 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్ల ద్వారా రోజూ 5.50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఖాళీ స్థలాలతోపాటు కొన్ని వార్డుల్లో పాడుబడిన బావిబొందల్లో చెత్తను పోస్తున్నారు. కొన్ని వార్డుల్లో డైలీగా శుభ్రం చేయడంలేదు. హనుమాన్ వాడ, గడి బజార్‌కు చెత్త వాహనం రావడంలేదని, రెండు మూడు రోజులకు ఒకసారి చెత్తను తాము తగబెడుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. ఇందిరానగర్ కాలనీలో ప్రధాన రోడ్డు వెంట మురుగునీరు నిలుస్తుండడంతో దోమలు ప్రబలుతున్నాయి. నూతనంగా మురుగు కాల్వను నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.