వీధుల్లో చెత్త కుంపటి | - | Sakshi
Sakshi News home page

వీధుల్లో చెత్త కుంపటి

Jul 2 2025 4:59 AM | Updated on Jul 2 2025 4:59 AM

వీధుల

వీధుల్లో చెత్త కుంపటి

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం!

ఎక్కడ చూసినా చెత్తకుప్పలే..

రహదారుల వెంట దుర్గంధం

ప్రతిరోజూ శుభ్రం చేయని సిబ్బంది

అంతటా ప్రబలుతున్న దోమలు

సీజనల్‌ వ్యాధులు పొంచి

ఉన్నాయని ప్రజల్లో భయాందోళన

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రజల్లో అవగాహన లోపంతో ఎక్కడబడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీనికితోడు మున్సిపల్‌ సిబ్బంది ప్రధాన రోడ్లను శుభ్రం చేస్తున్నారే తప్పితే కాలనీల్లోని వీధులు, ఖాళీ స్థలాల్లో వేస్తున్న చెత్తను పట్టించుకోవడం లేదు. దీంతో సందు రోడ్ల పక్కన, కాలనీల్లోని ఇళ్ల మధ్యన చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని.. ఫలితంగా దోమల బెడద పెరుగుతోందని మున్సిపాలిటీల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక కొనసాగుతున్నప్పటికీ అది ప్రధాన రోడ్ల శుభ్రతకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున మున్సిపల్‌ అధికారులు స్పందించి ప్రతిరోజూ చెత్తను తొలగింపజేస్తూ వీధులు, రోడ్లను శుభ్రంంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపల్‌ పరిధిలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. మున్సిపల్‌ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. మొత్తం 225 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించాల్సి ఉండగా 179 మాత్రమే పని చేస్తున్నారు. సిబ్బంది కొరతతో అన్ని కాలనీల్లో గల్లీలు, రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న వారికి నామమాత్రంగా జరిమానా విధిస్తున్నారు. సకాలంలో చెత్త ట్రాక్టర్లు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక, మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించక పోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. తద్వారా మలేరియా, టైపాయిడ్‌, డెంగీ తదితర వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు.

13 వార్డులకు మూడు వాహనాలు

భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మున్సి పాలిటీలో 22వేల జనాభా ఉంది. జనాభా ప్రతిపాదికన కనీసం 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. కానీ, 34 మందే ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల మెయిన్‌ రోడ్డు మినహా మున్సిపాలిటీలో గల 13 వార్డుల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలేదు. అన్ని వార్డులకు మూడు చెత్త ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. పాత బస్టాండ్‌, సాయినగర్‌ నుంచి నారాయణగిరికి వెళ్లే ప్రధాన దారి పక్కనే చెత్తను పారబోస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. లక్ష్మణ్‌నగర్‌ కాలనీలో ఇళ్ల మధ్యనే మురుగునీరు చేరి ఉంది. మోడల్‌స్కూల్‌ సమీపంలో చెత్తడంపింగ్‌ యార్డు వల్ల దుర్వాసన వస్తోంది. పట్టణంలో అమృత్‌ పైప్‌లైన్‌ పనులు జరుగుతుండడంతో చాలా చోట్ల పైపులు పగిలి తాగునీరు కలుషితమవుతుంది. ఇప్పటి వరకు నీళ్లట్యాంకులను శుభ్రం పరిచి బ్లీచింగ్‌ చేసింది లేదు.

వీధుల్లో చెత్త కుంపటి 1
1/2

వీధుల్లో చెత్త కుంపటి

వీధుల్లో చెత్త కుంపటి 2
2/2

వీధుల్లో చెత్త కుంపటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement