
మెరుగైన వైద్యసేవలు అందించాలి
చౌటుప్పల్ : ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అన్నారు. చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. అన్ని రకాల బ్లాకులను కలియదిరిగారు. వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న వసతులు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రి పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంద పడకల అసుపత్రి ప్రారంభం అయితే ఎన్నో ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సాధారణ పర్యటనలో భాగంగానే తాను ఇక్కడికి విచ్చేశానని పేర్కొన్నారు. ఇక్కడ చూసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ చిన్నూనాయక్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ యశోద, ఏసీపీ పటోళ్ల మదుసూధన్‌రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అలివేలు, మండల వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటంరాజు, సీఐ మన్మథకుమార్, ఆర్‌ఐ సుధాకర్ ఉన్నారు.
ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
చైర్మన్ షమీమ్ అక్తర్
ఫ చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన