
రోజు విడిచి రోజు చెత్త సేకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో చెత్త నిర్వహణ అంతంతగానే ఉంది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 31,303మంది జనాభా, 8500 ఇళ్లు ఉన్నాయి. చెత్త నిర్వహణకు రెండు ట్రాక్టర్లు, 10 ఆటోలు ఉండగా ట్రాక్టర్లు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా ఆటోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఒక్కో ఆటో వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తున్నాయి. చాలా మంది చెత్తను ఆటోల్లో వేయకుండా వీధుల్లో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు వ్యాప్తిచెందాయి. చెత్త ఎక్కడబడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.