
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
మోత్కూరు: మతిస్థిమితం లేని గుర్తుతెలియని వృద్ధుడిని చేరదీసి వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్. వివరాలు.. గుర్తుతెలియని వృద్ధుడు కొద్దిరోజులుగా మోత్కూరు పట్టణంలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఒంటిపై బట్టలు సరిగ్గా లేకపోవడంతో పాటు ఆకలితో అలమటించేవాడు. ఇది గమనించిన మోత్కూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామనర్సయ్య వృద్ధుడిని చేరదీసి కొత్త దుస్తులు ఇప్పించాడు. అతడికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చాడు. అనంతరం అతడిని జనగామ జిల్లా కడవెండి సీతారాంపురంలో గల వృద్ధాశ్రమంలో చేర్పించాడు. కానిస్టేబుల్ మానవతా స్ఫూర్తిని స్థానికులు కొనియాడారు.
మతిస్థిమితం లేని వృద్ధుడిని చేరదీత