
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. నిజాం కాలేజ్ ప్రొఫెసర్ తడక యాదగిరి రూపొందించిన అనువాద రాజ్యాంగ సంకలన పుస్తకాన్ని బుధవారం పోచంపల్లిలోని అర్బన్ బ్యాంకు ఆడిటోరియంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగం పట్ల ప్రజల్లో మరింత చైతన్యం కల్పించడానికి తడక యాదగిరి సరళమైన భాషలో సంకలం చేసి రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అనంతరం బ్యాంకు పాలకవర్గం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, చేనేత నాయకులు తడక వెంకటేశం, సీఈఓ సీత శ్రీనివాస్, తడక యాదగిరి, రాపోలు జ్ఞానేశ్వర్, బ్యాంకు డైరెక్టర్లు ఏలే హరిశంకర్, రాపోలు వేణు, కె. ఎల్లస్వామి, మక్తాల నర్సింహ, గునిగంటి రమేశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, సీత సత్యనారాయణ పాల్గొన్నారు.