
పాలు పొంగించి.. పట్టువస్త్రాలు అందజేసి..
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్గిడి స్వప్న, బాలమల్లేష్ దంపతుల ఇంట్లోకి మంత్రి, విప్ కలిసి రిబ్బన్ కట్ చేసి గృహాప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంట్లో పాలు పొంగించి, ప్రత్యేక పూజలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు స్వప్న, బాలమల్లేష్ దంపతులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమక్షంలో గొర్రె పొట్టేలు, పట్టువస్త్రాలు కానుకగా అందజేశారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లను పూర్తిచేసుకుని బహుమతులు పొందాలని ఐలయ్య చెప్పారు.
గృహప్రవేశాలకు రావడం ఆనందంగా ఉంది
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోపే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మింస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్యరెడ్డి, దుంబాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, బీర్ల శంకర్, శిఖ ఉపేందర్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ముఖ్యర్ల మల్లేష్, ఎరుకల హేమేందర్, బందారపు భిక్షపతి, కాల్నె భాస్కర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుకి గొర్రె పొట్టేలు అందజేసిన ప్రభుత్వ విప్ ఐలయ్య

పాలు పొంగించి.. పట్టువస్త్రాలు అందజేసి..