
నూతన అడ్మిషన్లు 5,802
ప్రభుత్వ బడుల్లో గణనీయంగా పెరిగిన ప్రవేశాలు
ఫ ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,119 మంది రాక
ఫ యూడైస్‌లో నమోదు ముగిసే నాటికి మరింత పెరిగే చాన్స్
భువనగిరి: సర్కారు బడులు కళకళాడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో ఈసారి రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 5,802 మంది కొత్తగా చేరారు.
తెరుచుకున్న
మూతబడిన స్కూళ్లు
2024–25 విద్యా సంవత్సరం ముగిసే నాటికి జిల్లాలో విద్యార్థులు లేక 60 పాఠశాలలు మూతబడి ఉన్నాయి. అందులో మూడు స్కూ ళ్లు తెరుచుకున్నాయి. ఇందులో బొమ్మలరామారం మండలం యావాపూర్, బీబీనగర్ మండలం పెద్ద పలుగుతండా, గుండాల మండలం నూనెగూడెం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
ప్రైవేట్ నుంచి యూటర్న్..
ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, నాణ్యమైన బోధన.. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భారంతో తల్లిదండ్రులు సర్కారు స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,119 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను సర్కారు బడుల్లో చేరుస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది చేరారు.
గత ఏడాదికంటే ఎక్కువ
జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలున్నాయి. గత ఏడాది 4,040 మంది చేరగా.. ఈసారి ఇప్పటి వరకు 5,802 మంది అడ్మిషన్ పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే 1,762 మంది ఎక్కువ. 1వ తరగతిలో 2,681, 2 నుంచి 10వ తరగతిలో 3,121 మంది అడ్మిషన్ పొందారు. అత్యధికంగా మోత్కూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 149 మంది చేరారు. య్యూడైస్‌లో నమోదు ముగిసే నాటికి మరో 1,500 వరకు ప్రవేశాలు పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్‌లు
సంవత్సరం ప్రవేశాలు
2023–24 4,419
2024–25 4,040
2025–26 5,802
ఇప్పటి వరకు
ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించా
మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదివించాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అర్హులైన, అనుభజ్ఞలైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్‌కు దీటుగా బోధన అందుతుంది. రఘునాథపురం పాఠశాల గత కొన్నేళ్లుగా టెన్త్‌లో మంచి ఫలితాలు సాధిస్తుంది. అందుకే తమ ఇద్దరు పిల్లలను 9వ తరగతిలో రఘునాథపురం స్కూల్‌లో చేర్పించాం.
–సుప్రియ, ఉపాధ్యాయురాలు, రాజాపేట హైస్కూల్

నూతన అడ్మిషన్లు 5,802