
పైప్‌లైన్ పనులు మొదలే కాలేదు
ఆలేరు: మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, సుమారు 20వేల జనాభా ఉంంది. రూ.12 కోట్లు మంజూరు కాగా గత సెప్టెంబర్‌లో పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో 10 లక్షల లీటర్లు, పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 7 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇందులో జూనియర్ కళాశాల ఆవరణలోని ట్యాంకు నిర్మాణం 30 శాతం మేరకు జరిగింది. పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ట్యాంక్ నిర్మాణం పిల్లర్ల వరకే పూర్తయ్యింది. 14 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించాల్సి ఉండగా నేటికీ పనులు మొదలే కాలేదు.