
ఎమ్మెల్యే అయిలయ్య మార్నింగ్ వాక్
ఆలేరు: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమానికి శీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలేరులోని పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఇంటి బిల్లు వచ్చిందా..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పునాది వరకు పూర్తయిన లబ్ధిదారులను బిల్లు వచ్చిందా.. అని అడగగా రాలేదని సమాధానం చెప్పారు. కారణాలపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించగా కొందరి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, వారం రోజుల్లో బిల్లులు వస్తాయని వివరించారు. లక్ష రూపాయల బిల్లు వస్తే.. లబ్ధిదారులు మరింత దైర్యంగా మిగితా దశ పనులు పూర్తి చేయడానికి ఉత్సాహం చూపుతారని, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టలేదని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వారికి కొన్ని రోజలు గడువు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అప్పటికీ నిర్మాణాలు ప్రారంభించకపోతే వారితో ఇళ్లు కట్టలేమని లేఖ రాయించుకుని, వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్లు త్వరగా పూర్తి చేస్తే గృహప్రవేశానికి వస్తానని ఎమ్మెల్యే లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. అనంతరం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
శిల్పారామంలో బోటు షికారు
భువనగిరి : నిత్యం తీరికలేకుండా ఉండే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఉల్లాసంగా గడిపారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాయగిరి వద్ద ఉన్న మినీ శిల్పారామాన్ని సందర్శించారు. చెరువులో బోటు షికారు చేశారు. కూచిపూడి నృత్యకళాకారులను పలకరించి వారితో ఫొటోలు దిగారు. సందర్శకులతో ఆయనతో సెల్ఫీలు దిగారు.
ఫ ఆలేరులోని పలు వార్డుల్లో పర్యటన
ఫ ప్రజా సమస్యలపై ఆరా

ఎమ్మెల్యే అయిలయ్య మార్నింగ్ వాక్