
ఆకట్టుకున్న ‘కూచిపూడి’
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలో ఆదివారం హైదరాబాద్‌కు చెందిన నృత్య కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యాలతో అలరించారు. రాత్రి ఆలయ ద్వారబంధనం చేసే సమయం వరకు సాంస్కృతి కార్యక్రమాలు కొనసాగాయి.
టీకాతో రేబిస్ నియంత్రణ
భువనగిరిటౌన్ : శునకాల నుంచి మనుషులకు వ్యాపించే రేబిస్ వ్యాధిని టీకాతో అరికట్టవచ్చని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో రేబిస్ వ్యాధి నివారణకు కుక్కలకు ఉచిత టీకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రేబిస్ ప్రాణంతకమైన వ్యాధి అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కుక్కలకు టీకా వేయించాలని సూచించారు. అంతకు ముందు రాచకొండ పోలీస్ డాగ్ స్క్వాడ్ అదనపు కలెక్టర్‌కు గౌరవ వందనం సమర్పించాయి. కార్యక్రమంలో పశువైద్య అధికారి మోతిలాల్, పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపిరెడ్డి, సహాయ సంచాలకులు వి.కృష్ణ, శ్రీకాంత్, రాంచంద్రారెడ్డి, సునీత, చైతన్య, ప్రత్యూష, భాస్కర్, గిరి, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీపై సమీక్ష
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫుడ్ సేఫ్టీ (ప్రసాదం), గ్రీన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌పై ఈఓ వెంకట్రావ్ ఆదివారం హైమ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రికల్ వైరింగ్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌ఓ 14001, 22000 సర్టిఫికెట్ల కోసం దేవస్థానం అర్హత సాధించే విషయాలపై చర్చించారు.
గుట్ట గోశాలలో వన మహోత్సవం
యాదగిరిగుట్ట: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోశాలలో దేవాదాయ వైధిక సలహాదారులు గోవింద హరి మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోఈఓ వెంకట్రావ్, డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ‘కూచిపూడి’

ఆకట్టుకున్న ‘కూచిపూడి’