
ఆరు నెలలుగా నిలిచిన పనులు
మోత్కూరు : రూ.12 కోట్లు మంజూరు కాగా.. ఈ నిధులతో రెండు ట్యాంకులు, 12 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. 1000 నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేశారు. కె.ఎన్.ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పనులు చేపట్టింది. ఏడాదిన్నర గడిచినా ట్యాంకుల నిర్మాణం.. పిల్లర్లు, బేస్మెంట్ దశలోనే ఉన్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాల్లో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఆరు నెలల క్రితం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

ఆరు నెలలుగా నిలిచిన పనులు

ఆరు నెలలుగా నిలిచిన పనులు