
నేడు యాదగిరిగుట్టకు మంత్రి ‘అడ్లూరి’ రాక
యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట రూరల్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రానున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. శ్రీస్వామి వారిని దర్శించుకుని అనంతరం మంత్రి యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణానికి సహకరించాలి
భువనగిరి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు పేద ప్రజలకు ఇసుక, సిమెంట్, స్టీల్, గ్రానైట్ వ్యాపారులతోపాటు, తాపీ మేసీ్త్రలు సహకరించాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. జూన్ 30 సాక్షి దినపత్రికలో ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించారు. ఇందులో భాగంగా మంగళవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో సిమెంట్, స్టీలు యాజమానులు, ఇసుక, గ్రానైట్, తాపీ మేసీ్త్రలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. భువనగిరి మండలంలో 743, పట్టణంలో 580 ఇళ్లు మంజూరు చేశామన్నారు. గృహనిర్మాణ మెటీరియల్ ధరలను పెంచడం వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. పాత ధరల ప్రకారమే అమ్మాలన్నారు. సమావేశంలో డీఏఓ మందడి ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ దినాకర్, ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, ప్రదీప్, నర్సింహ, నానం కృష్ణ,, ఇసుక, స్టీలు, సిమెంట్, గ్రానైట్ యాజమాన్యాలు, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.
ఉపకరణాలకు
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలోని వివిధ వర్గాల దివ్యాంగులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఉపకరణాల కో సం ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ 49, బ్యాటరీ వీల్ చైర్స్ 15, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్ 20, బ్యాటరీ మినీ ట్రెండింగ్ ఆటోవెహికల్ 1, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్‌మెంట్ వీల్ 5, లాప్టాప్ డిగ్రీ స్టూడెంట్స్ 16, లాప్టాప్ హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ 7, టాబ్స్ 12, 5జీ స్మార్ట్‌ఫోన్ 2, ట్రై సైకిల్స్ 6, వీల్ చైర్స్ 6, క్రచ్చెస్ 25, ఇయరింగ్ ఎయిడ్ 2, వాకింగ్ స్టిక్స్ 25 స్మార్ట్ కేనన్స్ 12, ఎంసీఆర్ చాఫల్ 12, సహాయ ఉపకరణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కావాల్సిన ఉపకారణాల కోసం https-://tgobmms.cgg.gov.in ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈనెల 5తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
సగటు వర్షపాతం
83 మిల్లీమీటర్లు
భువనగిరిటౌన్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం సగటున 83 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదూంది. రాజాపేట మండలంలో అత్యధికంగా 44.5 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. అలాగే ఆలేరులో 44, మోత్కూరు 41, ఆత్మకూర్(ఎం) 41, అడ్డగూడూరు 39 మి.మీ. వర్షం కురిసింది. బొమ్మలరామారం మండలంలో 39, యాదగిరిగుట్ట 38, భువనగిరి 28, గుండాల 25, బీబీనగర్ 24, తుర్కపల్లి మండలంలో 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈఏపీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆలస్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఈఏపీ సెట్ విద్యార్థుల సర్టిఫికేషన్ ప్రక్రియ సర్వర్ బిజీతో ఆలస్యంగా కొనసాగింది. సర్వర్ బిజీగా ఉండడంతో మధ్యాహ్నం వరకు కూడా 10 నుంచి 15మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మాత్రమే అధికారులు వెరిఫికేషన్ చేశారు. దీంతో విద్యార్థులు, వారితో వచ్చిన తల్లిదండ్రులకు నిరీక్షణ తప్పలేదు. మధ్యాహ్నం తరువాత సర్వర్ మంచిగా పనిచేయడంతో వెరిఫికేషన్ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. సాయంత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసే వరకు 165 మంది పాల్గొన్నారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

నేడు యాదగిరిగుట్టకు మంత్రి ‘అడ్లూరి’ రాక