ఖర్గే సభకు జనసమీకరణ | - | Sakshi
Sakshi News home page

ఖర్గే సభకు జనసమీకరణ

Jul 1 2025 5:17 PM | Updated on Jul 1 2025 5:17 PM

ఖర్గే సభకు జనసమీకరణ

ఖర్గే సభకు జనసమీకరణ

సాక్షి, యాదాద్రి: హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే పాల్గొనే బహిరంగ సభకు జన సమీకరణపై జిల్లా నాయకత్వం దృష్టి సారించింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌ల నుంచి 1,500 చొప్పున సభకు తరలించాలని అధిష్టానం జిల్లా నేతలకు సూచించింది. ఈ మేరకు సోమవారం భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన టీపీసీపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభను విజయవంతంపై చర్చించారు. రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక ఇంచార్జిని నియమించారు. మరోసారి మంగళవారం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్‌, వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి, జనగామ కాంగ్రెస్‌ నియోజవకర్గ ఇంచార్జిలతో డీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఇంచార్జిలు సమావేశం కానున్నారు.

ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

సభకు కార్యకర్తలను ఆర్టీసీ బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మండల, గ్రామ శాఖలు, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల సభ్యులను తరలించనున్నారు. సమావేశంలో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జిలు కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నూతి సత్యనారా యణగౌడ్‌, ఈవీ శ్రీనివాసరావు, నాయకులు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, రాచమల్ల రమేష్‌, సత్యనారాయణ, పడిగెల ప్రదీప్‌, అతహర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఫ 10,500 మందిని తరలించాలని నిర్ణయం

ఫ ఇంచార్జ్‌లతో డీసీసీ అధ్యక్షుడి సమావేశం

ఫ నేడు ఎంపీ, ఎమ్మెల్యేలతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement