సాగు చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సాగు చట్టాలపై అవగాహన అవసరం

Jun 29 2025 11:43 AM | Updated on Jun 29 2025 11:43 AM

సాగు

సాగు చట్టాలపై అవగాహన అవసరం

భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం : సాగు చట్టాల గురించి రైతులకు తెలిసి ఉండాలని, వాటిపై అవగాహన కల్పించడమే సాగు న్యాయయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలంగాణ రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. శనివారం భూదాన్‌పోచంపల్లిలోని వినోబాభావే మందిరం నుంచి లీఫ్స్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి సునీల్‌ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్రకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి జిల్లా పరిధిలో పోచంపల్లి, చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో భూమి సునీల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. పెరిగిన సాగు పెట్టుబడికి అనుగుణంగా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, ఎరువుల వాడకం వల్ల నష్టపోయినప్పుడు, పంటల బీమా వర్తించనప్పుడు చట్టాల ద్వారానే లబ్ధిపొందడం సాధ్యమవుతుందన్నారు. అందుకే సాగు చట్టాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుండాలని రైతులకు సూచించారు. రైతు కుటుంబంలో జన్మించిన రేవంత్‌రెడ్డి.. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.

కార్యక్రమం ఏదైనాపోచంపల్లి నుంచే : సునీల్‌

తాను ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని భూదాన్‌పోచంపల్లి నుంచే ప్రారంభించానని లీఫ్స్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి సునీల్‌ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో కలిపి భూమి, వ్యవసాయానికి సంబంధించి 174 చట్టాలు ఉన్నాయని, వీటిపై రైతులకు అవగాహన ఉండాలన్నారు.హైదరాబాద్‌లోని బాపుఘాట్‌ వద్ద అక్టోబర్‌ 2న యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం ముందుంచుతామని చె ప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు నివేదిస్తామన్నారు.

భూదానస్థూపం వద్ద నివాళి

భూదాన్‌పోచంపల్లిలో ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలతో పాటు భూదానస్థూ పం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాగు న్యాయయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జలాల్‌పురం గ్రామానికి చెందిన రైతు గోరంటి శ్రీనివాస్‌రెడ్డి లీఫ్స్‌సంస్థకు రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యుడు కేవీఎన్‌ రెడ్డి, భూదానయజ్ఞబోర్డు మాజీ అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి, లీఫ్స్‌ సంస్థ ప్రతినిధులు జీవన్‌రెడ్డి, మల్లేశ్‌, అభిలాష్‌, రవి, ప్రవీణ్‌, గాంధీగ్లోబల్‌ ఫ్యామిలీ ప్రతినిధి యానాల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేశ్‌, డీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఏఓ నాగరాజు, పీఏ సీఎస్‌ చైర్మన్‌ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నారాయణపురంలో సమస్యల ఏకరువు

నారాయణపురంలోని సర్వే నంబర్‌ 255లోని అసైన్డ్‌ భూముల్లో తరాతరాలుగా సాగు చేసుకుంటున్నామని, పట్టాలు కూడా ఇచ్చారని, బ్యాంకు రుణాలు తీసుకున్నామని, అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. రాచకొండలోని రెవెన్యూ భూముల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులు సుమారు 3వేల మంది తరతరాలుగా సేద్యం చేసుకుంటున్నామని, అన్ని ఆధారాలున్నా ఆటవీ శాఖ ఆధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని, సాగు జాలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని.. ఇలా వివిధ సమస్యలపై రైతులు, సీపీఐ నాయకులు విన్నవించినారు. ఈ కార్యక్రమంలో నీటి పోరాట నాయకుడు కేవీఎన్‌ రెడ్డి, గోవింద్‌, హరి, మల్లేష్‌, సీపీఐ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్‌, చిలుదేరు అంజయ్య, మందుగుల భాలకృష్ణ, ఏపూరి సతీష్‌, ధన్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌

లీఫ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో

సాగు న్యాయయాత్ర

సాగు చట్టాలపై అవగాహన అవసరం1
1/1

సాగు చట్టాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement