
విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరు
సాక్షి, యాదాద్రి: జిల్లాకు విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరైంది. ఇప్పటి వరకు నల్లగొండలోని స్టోర్ నుంచి మెటీరియల్‌ను డ్రా చేస్తున్నారు. యాదాద్రి జిల్లాకు స్టోర్ మంజూరుతో రైతులు, వినియోగదారులు, విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు తొలగనున్నాయి. నల్లగొండకు వెళ్లి మెటీరియల్ డ్రా చేయడం తప్పుతుంది. కాగా స్టోర్ ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం కావాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కలెక్టర్ హనుమంతరావును కోరారు. బీబీనగర్ మండలం గూడూరు రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 69లో ఐదు ఎకరాల భూమి ఖరారైందని, అప్పగించడానికి రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ముగిసిన బేస్‌లైన్ పరీక్షలు
భువనగిరి: గత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ విద్యార్థులు సాధించిన కనీస అభ్యసన లక్ష్యాలను అంచనా వేసేందుకు జిల్లా విద్యాశాఖ జూన్ 25నుంచి నిర్వహిస్తున్న బేస్‌లైన్(ప్రాథమిక) పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 715 ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 15లోగా ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నారు. తిరిగి నవంబర్ మిడ్‌లైన్, మార్చిలో ఎండ్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
అన్నప్రసాద వితరణకు రూ.25 లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వితరణ చేసే నిత్యాన్నదాన ప్రసాద పథకానికి హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణరాజు రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. సోమవారం యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం తన మనుమడు అనంత్ ఇషాన్ పేరున ఈఓ వెంకట్రావ్‌కు చెక్కు అందజేశారు. .
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా శ్రీనివాస్‌గౌడ్
ఆలేరు: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్‌గౌడ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నియమించారు. సోమవారం ఆయన వరంగల్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, పలువురు నాయకులు సన్మానించారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025 సంవత్సరానికి గాను అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు nationalawardstoteachers.ed ucation.gov.in లో ల వెబ్‌సైట్ ద్వారా నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.
అనధికార ప్లాట్ల పరిశీలన
ఆలేరురూరల్: ఆలేరు మండలం శారాజీపేట రెవెన్యూ పరిధిలో అనధికారిక ప్లాట్లను సోమవారం లోకాయుక్త బృందం పరిశీలించింది. సర్వే నంబర్ 76లోని రెండు ఎకరాల భూమిని ఓ రైతు వద్ద వజ్జె రజినీ అనే వ్యక్తి 2008 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. అనుమతి పొందకుండా లేఅవుట్ చేసి అందులో 270కి పైగా ప్లాట్‌లను విక్రయించాడు. ఈ విషయంపై బా ధితులు పలుమార్లు ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. లోకాయుక్తను ఆశ్రయించడంతో ప్రతినిధుల బృందం ప్లాట్లను పరిశీలించింది. కార్యక్రమంలో లోకాయుక్త విచారణ అధికారి మత్తువ్‌కుషి, వెంకట్‌రావు, సుధాకర్, శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, సీఐ కొండల్‌రావు, డీటీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరు