
డీసీసీబీ టర్నోవర్ రూ.598.16 కోట్లు
నల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లుకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీబీలో కేక్ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్‌ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్‌రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి