
ఉపాధ్యాయురాలిపై ఐలయ్య ఆగ్రహం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తనిఖీకి వెళ్లిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు చేదు అనుభవం ఎదరైంది. శనివారం మధ్యాహ్న సమయంలో పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల వండిన భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యతగా ఉండటంలేదని, మెనూ అమలు చేస్తలేరని విద్యార్థులు ఐలయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్న భోజన ఇంచార్జిగా ఉన్న ఉపాధ్యాయురాలు రాధికను పిలిపించారు. మెనూ ప్రకారం శనివారం మిక్స్‌డ్ కూరగాయలు ఉండాలని.. కానీ, ఎక్కువగా దోసకాయలు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అందుకు ఆమె ప్రభుత్వ విప్‌పైకి వేలు చూపుతూ.. భోజనం ఇట్లానే ఉంటదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అవాకై ్కన ఐలయ్య.. ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మధ్యాహ్న భోజన ఇంచార్జి టీచర్ రాధికను వివరణ కోరగా.. తనను మహిళ అని చూడకుండా అగౌరవపరిచేలా మాట్లాడారని చెప్పారు.