
ఏసీపీగా విజయ్‌కుమార్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఏసీపీగా జి.విజయ్‌కుమార్‌ను నియమిస్తూ డీజీపీ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తు న్న ఏసీపీ సైదులు గతంలోనే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ సీసీఆర్‌బీలో ఏసీపీగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : మండలంలోని అనంతారం పరిధిలో గల పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ స్వప్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్లు 9948984800, 7396121244ను సంప్రదించాలని కోరారు.
హెల్మెట్‌తో రక్షణ
భువనగిరి : విధి నిర్వహణలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధీర్‌కుమార్ సిబ్బందికి సూచించారు. సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా ప్రమాదకరమైన పనులు చేసే అవకాశం ఉంటుందని, అలాంటప్పుడు హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్‌లు తది తర రక్షణ కవచాలను ధరించాలని సూచించారు. అనంతరం సిబ్బందికి హెల్మెట్‌లు అందజేశారు.
టిప్పర్లకు జరిమానా
రాజాపేట : మండలంలోని చల్లూరు మల్వ వాని చెరువునుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లకు లక్ష 22 వేల 866 రూపా యలు జరిమానా విధించారు. వారం రోజులు గా అనుమతి లేకుండా మల్వవాని చెరువునుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. 100 కాల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 23 టిప్పర్లను పట్టుకున్నారు. వాటిని మైనింగ్ అధికారులకు అప్పగించగా జరిమానా విధించారు. చెరువునుంచి ఎంత మట్టి తరలించారన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఏడీ తెలిపారు.
ప్రతి దరఖాస్తునూ పరిశీలించాలి
భువనగిరి, చౌటుప్పల్ : భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాలను సందర్శించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలతో సమావేశమై దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. పాత రికార్డుల ఆధారంగానే దరఖాస్తులను పరిష్కరించాలని, తప్పులకు తావుండరాదన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, తహసీల్దార్లు శ్రీ నివాస్‌రెడ్డి, వీరాభాయి, దశరథనాయక్, లాల్‌బహదూర్‌సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.
టీజీఈఏపీ
సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ): ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీఈఏపీ సెట్ –2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్లో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపాల్ నరసింహారావు తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు మూడు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, సెట్ హాల్ టికెట్, ఎస్‌ఎస్‌సీ మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, ఒరిజినల్ టీసీ, కుల ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోని రావాలన్నారు.

ఏసీపీగా విజయ్‌కుమార్

ఏసీపీగా విజయ్‌కుమార్